నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District)లో ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని(Prajavani Program) ఈ వారం రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilasha Abhinav) తెలిపారు. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ప్రభుత్వ పథకాలపై సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు ఎవరు ప్రజావాణికి రావద్దని సూచించారు.