21-04-2025 06:51:33 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 40 దరఖాస్తుల రాగా వాటిని సంబంధిత అధికారులకు అందించి వాటిని పరిష్కరించాలని సూచించారు. భూ సమస్యలు ఇందిర ఇండ్లు పెన్షన్లు రేషన్ కార్డుల దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఓ రత్న కళ్యాణి అధికారులు పాల్గొన్నారు.