03-03-2025 04:23:21 PM
తహసీల్దార్ సంజయ్ రావు
కామారెడ్డి,(విజయక్రాంతి): దోమకొండ మండల ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రతి సోమవారం ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సంజయ్ రావు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలందరూ వారి సమస్యలను పరిష్కారించుకోవాలని సూచించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారిని మణిదీపిక, ఏపీవో రజిని, ఎక్సైజ్ సిబ్బంది, బీసీ హాస్టల్ వార్డెన్ ఉన్నారు.