calender_icon.png 21 November, 2024 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి అర్జీలు పరిష్కరించాలి

04-11-2024 04:56:50 PM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 48 ఆర్జీలను స్వీకరించారు. అందులో రెవిన్యూ శాఖ 24, మున్సిపాలిటీ 5, జిల్లా పంచాయతీ అధికారి 5, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ 3, సర్వే ల్యాండ్ రికార్డ్ 2, ఎక్సైజ్ శాఖ, సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, మైనింగ్ శాఖ, వైద్య శాఖ, హౌసింగ్, ఆర్.డబ్ల్యూ.ఎస్, పోలీస్ శాఖ, ఆర్టీసీకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్  వీరా రెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి శోభారాణి, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్, వివిధ శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.