గద్వాల టౌన్ (విజయక్రాంతి): నవంబర్ 18న కూడా గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నందున 18వ తేదీ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని జోగులాంబ గద్వాల్ జిల్లాలో రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు అందరూ గ్రూప్-3 పరీక్షల నిర్వహణలో ఉంటారని అందువల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులు తీసుకొని దూర ప్రాంతాలను నుండి కలెక్టరేట్ కు వచ్చి అసౌకర్యానికి ఇబ్బంది పడకూడదని తెలిపారు.