హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నేడు (జూలై 1) ప్రజావాణి నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి కాట ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు 040 23222182 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలపవచ్చని చెప్పారు. అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు.