సర్ధార్ పటేల్ స్టేడియం నుంచి జెడ్పీ సెంటర్ వరక కొనసాగిన ర్యాలీ
ఖమ్మం (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయిన సందర్బంగా ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ప్రజాపాలన విజయోత్సవ 2కె రన్ నిర్వహించడం జరిగిందని జిల్లా యువజన క్రీడా శాఖా అధికారి సునీల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఖమ్మంలోని సర్ధార్ పటేల్ స్టేడియం నుంచి నిర్వహించిన 2కె రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు కలిసి జిల్లా పరిషత్ సెంటర్ వరకు 2కె రన్‌ను ఉత్సాహాంగా కొనసాగించారు. యువత, ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ద వహించేలా అవగాహన కల్పిస్తూ 2కె రన్ నిర్వహించడం జరిగిందని, నిత్యం తమ దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిడులకు గురవుతూ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఎల్లప్పుడూ ధృఢంగా, ఆరోగ్యంగా ఉండేలా ఆరోగ్య వ్యాయామాలు, ఆహార నియమాలు పాటించి, వ్యక్తిగత శ్రద్ద వహిస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్బంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, యువతీ యువకులు, ఉద్యోగులు, క్రీడాకారులు, పోలీస్, వివిధ శాఖల ఉద్యోగులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.