అనంతగిరి, విజయక్రాంతి: ప్రజాపాలన కళాయాత్ర పదోవరోజున అనంతగిరి మండలం వసంతపురం వాయిలసింగారం గ్రామాలలో కొనసాగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 500 కు గ్యాస్ సిలిండర్ రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు స్కిల్ యూనివర్సిటీ రెసిడెన్షియల్ స్కూలు రైతుకు రెండు లక్షల రుణమాఫీ 200 యూనిట్ల ఉచిత కరెంటు యువతకు ఉద్యోగాలు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ స్వయం సహాయక సంఘాలకు నిధులు గిరిజన శిక్షణ ఉపాధి కేంద్రాలు ఎన్నో రకాల అభివృద్ధి పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాలను తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు కళారూపాల ద్వారా జిల్లా నలుమూలల ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై కళా ప్రదర్శనలు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలోమాజీ ఎంపిపి చుండూరువెంకటేశ్వర్లు, కార్యదర్శులు, అక్షయ్ తేజ, గురు లక్ష్మి,సాంస్కృతిక సారధి టీం లీడర్ ఈర్ల సైదులు, గడ్డం ఉదయ్, పాలకుర్తి శ్రీకాంత్, డప్పు శంకర్, పాక ఉపేందర్, మేడిపల్లి వేణు, గజ్జి మంజుల, సిరిపాంగి రాధ, మల్లెపాక శిరీష, అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు