calender_icon.png 28 September, 2024 | 4:57 PM

ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ

09-09-2024 01:41:57 PM

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ 

జగిత్యాల, (విజయక్రాంతి): నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు అని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.  సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో  ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి జిల్లా వెనుక బడిన తరగతి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా  జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కాళోజీ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ భాషకు అస్తిత్వ స్పృహను పెంచడంలో కాళోజీది కీలక పాత్రని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం పద్మవిభూషణ్‌ బిరుదుతో  గౌరవించిందని తెలిపారు. ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు అన్నారు. తెలుగు భాష పట్ల  ప్రజాకవికి ఎనలేని మమకారం ఉండేదని,  ప్రభుత్వం ఆయన పుట్టిన రోజు తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా  కాళోజీ జయంతి నిర్వహిస్తూ భావితరాలకు స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, కలెక్టరేట్ ఏఓ హన్మంతరావు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి సాయిబాబా, జిల్లా