బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అధికారులు వినతి పత్రాలు స్వీకరించారు. త్వరలోనే సమస్యలపై సమీక్ష నిర్వహించి దశలవారీగా పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ ప్రజల సమస్యలు నేరుగా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు.