హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవ సభలో భాగంగా నగరంలోని ఐమాక్స్ గ్రౌండ్స్ లో సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నెక్లెస్ రోడ్డులో ఫుడ్, హస్తకళల స్టాళ్లు రేపటి వరకు కొనసాగుతాయి. బిర్యానీ, చాట్, ఐస్క్రీం, తెలంగాణ, ఉత్తరాది ఫుడ్ స్టాళ్లు ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. నేడు, రేపు రాజీవ్ గాంధీ విగ్రహం, ఎన్టీఆర్ స్టేడియం, ఫుడ్ ఓవర్ బ్రిడ్జి వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు జరుగనున్నాయి. సోమవారం సచివాలయ ప్రాగంణలో తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండాసురేఖ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.