కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అందరూ మెచ్చే పాలనను అందిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఎక్కడ ఖర్చు పెట్టాలి ? ఎక్కడ ప్రజలకు మేలు చేయాలి ? ఉన్నదాంట్లో సుపరిపాలన ఎలా అందించాలి అనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆర్భాటాలకు తావు లేకుండా ప్రజల సంక్షేమ ధ్యేయంగా దృఢ సంకల్పంతో కంకణబద్ధులమై పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గడచిన పదేళ్లలో ఆ ప్రభుత్వం చేసింది ఏందో ఒకసారి గమనించాలన్నారు.
ఏవో మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే ప్రభుత్వం తమది కాదని ఉన్నది, ఉన్నట్లు చెబుతూ ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నామని పేర్కొన్నారు. కక్ష సాధింపు కు తావు లేకుండా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ఈ పరిపాలన విధానాన్ని చూసి బీఆర్ఎస్ నేతలు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ ప్రజాపాలనను అందిస్తున్న నేపథ్యంలో ప్రజా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ ఫైనల్ కార్పొరేషన్ చైర్మన్ ఓబైదువుల కొత్వాల్, మునిసిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, నాయకులు ఎన్ పి వెంకటేష్, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ ,బెక్కెరి మధుసూదన్ రెడ్డి, అజ్మత్ అలి మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.