calender_icon.png 11 January, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజా పాలన దినోత్సవం

17-09-2024 10:59:56 AM

హైదరాబాద్;(విజయక్రాంతి): రాష్ట్ర  ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను మంగళవారం జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క దగ్గర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి నేరుగా పబ్లిక్ గార్డెన్ కు చేరుకొని జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 18న ఆవిష్కృతమైందన్నారు. తెలంగాణ అంటే త్యాగం, బలిదానం.. సాయుధ పోరాటానికి దొడ్డి కొమరయ్య లాంటి మంది వీరులు ఎందరో బీజం వేశారు. సెప్టెంబర్ 17 పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నిజాంపై ధాశరథి వ్యాఖ్యలను చదివి వినిపించిన సీఎం రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడారని తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రజాపాలన దినోత్సవం జరిపాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. విలీనం, విమోచనం అంటూ స్వప్రయోజనాల కోసం ప్రవర్తించడం సరికాదన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని తప్పుపట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందరూ కలిసి ఉంటారని చెప్పేందుకు సూచిక.. బిగించిన పిడికిలి అని, పెత్తందార్లు నియంతలపై పిడికిలి బిగించి పోరాటం చేశామన్నారు. నియంత నుంచి తెలంగాణకు స్వేచ్చ కల్పిస్తామని ఆనాడు భరోసా ఇచ్చాం..  పదేళ్లపాటు విధ్వంసమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పాలన పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నామని, రైతులు, కార్మికుల సంక్షేమం దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంటుందని, డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని హామీ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.