calender_icon.png 5 February, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాలెంట్ విద్యార్థికి ప్రశంసల వెల్లువ

05-02-2025 04:15:05 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): మండల స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో ప్రధమస్థాయి బహుమతి పొందిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్య పల్లి ఉన్నత పాఠశాలకు చెందిన పాకాల యశ్వంత్ రెడ్డిని ఆ పాఠశాల అధ్యాపక బృందం బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ అనురాధ విద్యార్ధిని అనునిత్యం గైడ్ చేసి మండల స్థాయిలో ప్రధమస్థానంలో నిలిపిన ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు ఆవుల పద్మశ్రీని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇలాంటి సైన్స్ టాలెంట్ ఏషియాలో జిల్లా రాష్ట్ర స్థాయిలలో పాల్గొని గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుగుణ, బేతి తిరుపతి రెడ్డి, మందుల వెంకట రమణారెడ్డి, మావిడాల సతీష్ కుమార్, ఎర్రి శ్రీనివాస్ రెడ్డి, మంద రమేష్ బాబు, దూడ సత్యానందం తదితరులు పాల్గొన్నారు.