ఆమ్‌స్టర్‌డామ్: నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న 87వ ప్రతిష్ఠాత్మక టాటా స్టీల్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద తొలి విజయాన్ని అందుకున్నాడు. సోమవారం మాస్టర్స్ విభాగంలో జరిగిన రెండో రౌండ్‌లో ప్రజ్ఞానంద మన దేశానికే చెందిన గ్రాండ్‌మాస్టర్ హరిక్రిష్ణపై గెలుపు సాధించాడు. ఈ విజయంతో 1.5 పాయింట్లు ఖాతా లో జమ చేసుకున్న ప్రజ్ఞానంద గుకేశ్‌తో కలి సి సమానంగా ఉన్నాడు. అనీశ్ గిరి తో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి , వ్లాదిమిర్‌తో గుకేశ్ డ్రా చేసుకున్నారు. చాలెంజర్స్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు దివ్య దేశ్‌ముక్, ఆర్.వైశాలీ తమ గేమ్‌లను డ్రాగా ముగించారు.