27-04-2025 12:07:42 AM
నాగోల్ - బండ్లగూడ డిపోలో అవార్డులు అందజేత
ఎల్బీనగర్, ఏప్రిల్ 26 : ప్రతి ఆర్టీసీ ఉద్యోగి సంస్థ బలోపేతానికి, సంస్థకు అధిక ఆదాయం తెచ్చే విధంగా కృషి చేయాలని నాగోల్ - బండ్లగూడ డిపో మేనేజర్ వెంకటేశం పిలుపునిచ్చారు. శనివారం బండ్ల గూడ డిపోలో మార్చి ,25 నెలకు సంబంధించిన ప్రగతి చక్రం అవార్డు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అవార్డులు అందచేశారు. డ్రైవర్లు ఇంధ పొదుపులో, కండక్టర్లు అత్యధిక ఆదాయం సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అవార్డు అందుకున్నారు. ఉద్యోగులకు డిపో మేనేజర్ వెంకటేశం అవార్డులు అందజేశారు. కార్యక్రమం లో సహాయక మేనేజర్ శాలిని, మెకానికల్ ఇంజినీర్ బాల యోగేశ్వరి, డిపో సిబ్బంది పాల్గొన్నారు.