ఎమ్మెల్యే కోవ లక్ష్మి...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవర్చుకోవడంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. బుధవారం రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ గ్రామంలో స్వయంభు శ్రీ కనకదుర్గ దేవి అమ్మవారినీ దర్శించుకున్నారు. అర్చకుడు దేవర వినోద్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నక్కలగూడ గ్రామంలోని సమ్మక్క సారలమ్మలకు మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మనిషి ప్రతిరోజు ఏదో ఒక పనిలో ఒత్తిడికి గురవుతారని మానసిక ప్రశాంతత కోసం దేవచింతన అవసరమన్నారు. అమ్మవార్లను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.