హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): వ్యవహారిక భాషోద్యమ దివిటీ గిడుగు రామ్మూర్తి అని, వ్యవహారిక భాష సాధికారత కోసం ఆయన జీవితామంతా ధారబోశారని హైదరాబాద్ విశ్వవి ద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు అన్నారు. గురువారం వర్సిటీలో నిర్వహించిన గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలో ఆయన మాట్లాడారు. తెలుగులోని అన్ని మాండలి కాలు గొప్పవేనని పండితులను ఒప్పించి, వ్యవహారిక భాషకు గౌరవాన్ని తీసుకొచ్చా రని కొనియాడారు. కార్యక్రమంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య గోననాయక్, ఆచార్య వారిజారాణి, ఆచార్య వి.త్రివేణి తదితరులు పాల్గొన్నారు.