calender_icon.png 30 September, 2024 | 6:51 AM

చేనేత కార్మికులకు అండగా ప్రభుతం

29-09-2024 12:18:17 AM

ప్రభుత విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): చేనేత కార్మికులకు అండగా రాష్ర్ట ప్రభుతం ఉంటుందని ప్రభుత విప్, వే ములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నా రు. శనివారం వేములవాడ పట్టణంలో చేనే త పారిశ్రామికుల సహకార ఉత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ 91వ సరసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

రాష్ర్ట ప్రభుత ం ఇటీవల త్రిప్ట్ ఫండ్ పథకంలో భాగంగా విడుదల చేసిన రూ.25 లక్షల బకాయిల ఉ త్తరులను చేనేతలకు అందజేశారు. అంతకుముందు సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ కా ర్యవర్గ ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రిప్ట్ ఫండ్ పథకంలో భాగంగా నేతన్నలకు సీఎం రేవంత్‌రెడ్డి రాష్ర్ట వ్యాప్తంగా రూ.90 కోట్లు వి డుదల చేశారని పేర్కొన్నారు.

మహిళా సం ఘం గ్రూపుల్లోని 63 లక్షల సభ్యులకు సుమా రు 8 కోట్ల పైచిలుకు మీటర్ల వస్త్రాన్ని ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున ఇవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తరలోనే యార న్ డిపో ఏర్పాటుకు ప్రభుతం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీ ఈ సాగర్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.