calender_icon.png 27 December, 2024 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాశాఖ కమిషన్ చైర్మన్‌తో ప్రభుదయాల్

04-12-2024 03:49:30 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మంగళవారం కొత్తగూడెం మండల విద్యాశాఖాధికారి డా. ప్రభు దయాల్ కలిసి పలు విద్యాభివృద్ధి అంశాలను సమర్పించారు. డిఎస్సీ-24 ద్వారా పెద్ద సంఖ్యలో గణనీయంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారు. నూతనంగా విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు పాఠశాల నిర్వహణ-విద్య నూతన పోకడలు, పథకాల  గూర్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యారంగంలో ప్రాథమిక పాఠశాల స్థాయి పునాది కావున ప్రాథమిక విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని తెలపారు. పరీక్షల నిర్వహణ- సంస్కరణలు, పదో తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, భవిష్యత్తులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. చైర్మన్ మురళి ఈ సూచనలను పరిగణలో తీసుకుంటామన్నారు. విద్యారంగాభివృద్ధికై ఇదే రీతుల్లో కృషి చేయాలని సూచించారు.