calender_icon.png 23 October, 2024 | 6:49 PM

రాజాసాబ్ మోషన్ పోస్టర్.. మహారాజుగా సర్‌ప్రైజ్ చేసిన ప్రభాస్

23-10-2024 04:09:18 PM

రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే స్పెషల్ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తదుపరి రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్‌లో కనిపించనున్నారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో నైపుణ్యం ఉన్న మారుతీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక మోహనన్ ది రాజా సాబ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, నిధి అగర్వాల్ మరో కథానాయికగా నటిస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ మోషన్ పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు.

రెండు నిమిషాల మోషన్ పోస్టర్ హ్యాపీ బర్త్‌డే ట్యూన్‌ని ప్లే చేస్తూ మ్యూజిక్ బిట్‌తో ప్రారంభమవుతుంది, ఆపై బయటి నుండి శిథిలావస్థలో ఉన్న ప్యాలెస్‌ని మనం చూస్తాము. సింహాసనంపై కూర్చొని సిగార్‌ కాలుస్తూ సరికొత్తగా ప్రభాస్ దర్శనం ఇచ్చారు. ఈ మోషన్ పోస్టుర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీ రోల్ లో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ప్యాక్టరీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చుతున్న రాజాసాబ్ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మళయాళం, కన్నడలో పాన్ ఇండియా స్థాయిలో 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలపై రాజాసాబ్ మోషన్ పోస్టర్ చూసిన ఫ్యాన్ పండగ చేసుకుంటున్నారు. అభిమానులందరూ మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.


https://youtu.be/ihO4EGhUS_4