calender_icon.png 27 October, 2024 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామూలుగా కూర్చొని..

04-07-2024 12:05:00 AM

ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 28 98ఏడీ’. ఈ సినిమా విడుదలై గురువారానికి సరిగ్గా వారం రోజులవు తోంది. అయితే రిలీజ్ నుంచే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్ధ లు కొడుతోంది. తాజాగా అగ్ర కథానాయకులు రజనీకాంత్, విజయ్‌ల ఆల్ టైమ్ రికార్డులను సైతం బ్రేక్ చేసిందీ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 15 సినిమాల్లో రజనీకాంత్ నటించిన ‘జైలర్’, విజయ్ హీరోగా చేసిన ‘లియో’ లను ‘కల్కి’ అధిగమించింది. బుధవా రం వరకు అంటే.. కేవలం ఆరు రోజుల్లోనే ఉద్ధండ నటులు నటించిన ‘కల్కి’ రికార్డులు బ్రేక్ చేసింది.

ఇప్పటివరకు ‘కల్కి’ రూ.615 కోట్లు వసూలు చేసింది. కలెక్షన్ల జోరు కొనసాగుతుండటంతో మరిన్ని రికార్డులూ సొంతం చేసుకునే అవకాశం ఉందంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు నార్త్ అమెరికాలోనూ ‘కల్కి’పై కలెక్షన్ల వర్షం కురుస్తోంది. విడుదలకు ముందే అక్కడ మిలియన్ డాలర్స్ మార్క్‌ను క్రాస్ చేసిన ఈ చిత్రం ఉత్తర అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన ఆరో సినిమాగా ఘనతకెక్కింది. గతంలో నార్త్ అమెరికాలో బాలీవుడ్ హీరోలు అమిర్‌ఖాన్, రణ్‌వీర్ సింగ్ సినిమాల పేరిట ఉన్న రికార్డులను ‘కల్కి’ అధిగమించింది.

ఏడో రోజు లెక్కలు తేలేసరికి ఏడు వందల కోట్ల క్లబ్‌లోకి చేరిపోనుందా..? అంటే, ఫిల్మ్‌నగర్‌లో ఔననే సమాధానమే వినవ స్తోంది! ఇక ఈ ఆనంద క్షణాలను అభిమానగణంతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటోంది ‘కల్కి2898ఏడీ’ నిర్మా ణ సంస్థ. కలెక్షన్ల గురించి తాజా వార్తలపై హర్షం వ్యక్తం చేస్తూ.. తన అధికా రిక ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో ప్రభాస్ షూటింగ్ టైంలో సెట్‌లో మామూలు వ్యక్తిలా కూర్చొని ఉన్న ఓ ఫొటోను అప్‌లోడ్ చేసింది వైజయంతీ మూవీ స్. దానికి ఇలా రాసుకొచ్చింది.

‘ప్రపంచంలో అతిపెద్ద బాక్సాఫీస్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ వ్యక్తి ఇక్కడ మామూలుగా కూర్చోవడమే ఈ రికార్డులకు కారణం. ఆయన అంత సాధా రణంగా కూర్చొని సహకరించడం వల్లే ఇంత పెద్ద ఫలితాలు నమోదువుతున్నాయి.. మనం చేపట్టిన పనిని విజ యవంతంగా చేయగలమన్న నమ్మకాన్ని ఇచ్చాడు. మేమే అనుకున్న పని ని అనుకున్నట్టు చేసేందుకు స్వేచ్ఛనిచ్చాడు. మన అందరి డార్లింగ్ ఇప్పు డు ప్రపంచమంతటికీ భైరవ’ అని అభివర్ణించింది వైజయంతీ మూవీస్.