హైదరాబాద్,(విజయక్రాంతి): న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తరపున సినీ నటుడు ప్రభాస్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. డ్రగ్స్ వాడడం వల్ల కలిగే అనర్థాలను వీడియోలో వివరించారు. . జీవితంలో కావల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉందని ప్రభాస్ పేర్కొన్నాడు. మనల్ని ప్రేమించే, మనకోసం బతికేవాళ్లు మనకున్నారని, జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్..? ఆయన ఉద్ఘాటించారు. డ్రగ్స్‌కు నో చెప్పాలని అందరినీ ప్రోత్సహించాడు. మాదక ద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని ప్రభాస్ పిలుపునిచ్చారు. తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే 87126 71111 నంబర్ కు కాల్ చేసి చెప్పాలని ప్రభాస్ విజ్ఞప్తి చేశారు.