calender_icon.png 22 March, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పిరిట్‌కు ముహూర్తం ఫిక్స్!

22-03-2025 12:00:00 AM

స్పిరిట్’ చిత్ర ప్రారంభోత్సవానికి ముహూ ర్తం సెట్ అయిందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగాతో కూడా సినిమాకు సై అనడం.. టైటిల్ కూడా పెట్టేయడం జరిగిపోయింది. వీరిద్దరి కాంబోలో ‘స్పిరిట్’ తెరకెక్కాల్సి ఉంది. అయితే ఈ సినిమా అనుకుని చాలా కాలమవుతోంది కానీ ఇప్పటి వర కూ పట్టాలెక్కిందే లేదు. తాజాగా ఈ చిత్రానికి ముహూర్తం పెట్టేశారంటూ వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయని ఇక పట్టాలెక్కించడమే ఆలస్యమని అంటున్నారు.

ఉగాది పండుగ నాడు ఈ సినిమా ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది. ఉగాదిని మంచి ముహూర్తంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున చాలా కొత్త సినిమాలు ప్రారంభం అవుతుంటాయి. ఈసారి ప్రారంభం కానున్న చిత్రాల్లో ‘స్పిరిట్’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా లాంఛనంగా మాత్ర మే ప్రారంభమవుతుందట. రెగ్యులర్ షూటింగ్‌కు మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలస్తోంది. ‘ఫౌజీ’ షూటింగ్ దాదాపు ఎం డింగ్‌కు వచ్చాక ‘స్పిరిట్’కు ప్రభాస్ కేటాయిస్తాడట.