calender_icon.png 26 February, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభాస్ సో స్వీట్

26-02-2025 12:18:53 AM

ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమాలో కేరళ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. ప్రభాస్ అంటే ‘బాహుబలి’ సినిమా నుంచి ఎంతో అభిమానమని చెప్పింది.

“ప్రభాస్ అంటే ‘బాహుబలి’ సినిమా నుంచి చాలా అభిమానం. ఆయనతో కలిసి నటించాలని అప్పటి నుంచి కలలు కనేదాన్ని. ఈ సినిమా షూటింగ్‌లో తొలిసారి నేరుగా ప్రభాస్‌ని చూశా. ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఆశ్చర్యపోయా. ఇంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా ప్రతి ఒక్కరితో స్నేహంతో మెలుగుతారు. సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరితో సరదాగా ఉంటారు.

టీమ్‌కు ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. మంచి మనసున్య వ్యక్తి. షూటింగ్ స్పాట్‌లో అందరికీ స్వయంగా మంచి భోజనం తెప్పించి పెడుతుంటారు. ప్రత్యేకంగా అందరికీ బిర్యానీ వడ్డించి తను దగ్గరే ఉండి వారి చేత తినిపిస్తారు. నిజంగా ప్రభాస్ సో స్వీట్‌” అని మాళవిక చెప్పుకొచ్చింది.