07-03-2025 12:00:00 AM
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ‘రాజాసాబ్’ చిత్రాన్ని తెరకెకిస్తు న్నారు. ఇప్పటివరకు 90 శాతం షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. మరోవైపు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమాను డార్లింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. ప్రభాస్ చేతిలో ఇంకా ‘సలార్-2’, ‘ఫౌజీ’, ‘కల్కి-2’ సినిమాలున్నాయి. ఇదిలా ఉండగా ప్రభాస్ గురించి ఓ వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రభాస్ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ప్రస్తుతం ఇటలీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనేది దాని సారాంశం.
మొదటి అంతస్తు నుంచి ప్రభాస్ కిందకు జారిపడిపోవడంతో కాలుకు బలమైన గాయం అయిందని, ఆయన కదల్లేని స్థితిలో ఉన్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలోనూ బాహుబలి సినిమా షూటింగ్‌లో ప్రభాస్ ప్రమాదం బారినపడ్డారు. అప్పుడు గాయాలను ఏమాత్రం లెక్క చేయకుండా యాక్షన్ సీన్స్‌లో పాల్గొన్నారాయన.
అయితే, ఈసారి ప్రభాస్ కాలుకు తీవ్ర గాయమే అయ్యిందని, ఆరు నెలలపాటు విశ్రాంతి తీసుకోక తప్పదని వైద్యులు స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే, అసలు ప్రభాస్‌కు ఈ ప్రమాదం ఎలా జరిగింది? షూటింగ్‌లో భాగంగానేనా? మరేదైనా సంఘటన జరిగిందా? అనే విషయమై అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.