01-03-2025 12:00:00 AM
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చి త్రాన్ని చేయనున్నారని సమాచారం. ప్రభాస్ త్వరలోనే లుక్ టెస్ట్‌లోనూ పాల్గొంటారని టాక్. బాలీవు డ్ హీరో రణ్‌వీర్ సిం గ్‌తో ప్రశాంత్ తీయాలనుకున్న ‘బ్రహ్మరాక్షస్’ మధ్యలోనే ఆగిపోయింది.
అదే మైథలాజికల్ స్టోరీని ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మార్చుతున్నాడట ప్రశాంత్‌వర్మ. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్ నిర్మించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్‌వర్మ ఈ ప్రాజెక్టు కోసం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో తీయా లనుకున్న ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు సమాచారం.