calender_icon.png 22 February, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభాస్ యువరాణిగా?

19-02-2025 12:00:00 AM

 హీరో ప్రభాస్ జోరుమీదున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నాడు. రాజాసాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్స్‌తో క్షణం తీరిక లేకుండా ప్రభాస్ గడిపేస్తున్నాడు. రాజాసాబ్ షూటింగ్ దాదాపుగా చివరి అంకానికి చేరుకుంది. ఫౌజీ షూటింగ్ కారణంగా ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టడం ఆలస్యమవుతోంది.

హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ సెట్‌లోకి ఎంటర్ అయ్యింది. ఈ చిత్రం గురించి తాజాగా ఒక ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఒక పిరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది.

స్వాతంత్య్రం రాక ముందు జరిగే కథతో ‘ఫౌజీ’ రూపొందనుంది. ఇందులో యువరాణి పాత్ర ఒకటి కీలకం కానుంది. దీనికోసం బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ని హను రాఘవపూడి సంప్రదిస్తున్నారని సమాచారం. ఆలియాకు బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్ లోనూ చాలా క్రేజ్ ఉంది.

మరోవైపు అమ్మడికి బాలీవుడ్‌లో చేతినిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయట. దీంతో ప్రభాస్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్త నిజమై.. అమ్మడు యువరాణిగా చేస్తే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు సైతం కోరుకుంటున్నారు.