calender_icon.png 24 January, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభాకర్ జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలి

24-01-2025 12:55:32 AM

* ఎమ్మెల్సీ కోదండరాం 

భీమదేవరపల్లి, జనవరి 23: బహుజన సమాజ్ పార్టీ నాయకుడు, ఉద్యమ నాయకులు చెప్పాల ప్రభాకర్ జీవిత చరిత్రని పుస్తక రూపంలో తీసుకురావాలని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన బహుజన సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు చెప్పాల ప్రభాకర్ సంస్మరణ సభ గురువారం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. ప్రభాకర్ బహుజన సమాజ్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటుగా అంబేద్కర్ సంఘాల బలోపేతానికి ఈ  ప్రాంతంలో ప్రభాకర్ చేసిన కృషిని మరువలేమన్నారు. . అనారోగ్యంతో భార్య మృతి చెందిన కొంతకాలానికే గుండె సంబంధిత వ్యాధితో ప్రభాకర్ మృతి చెందడం బాధాకరమన్నారు.

ప్రభాకర్ ఉద్యమ జీవితాన్ని పుస్తకరూపంలో తీసుకురావడంలో ఈ ప్రాంత నాయకులు కృషి చేయాలని సూచించారు.  జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో సభాధ్యక్షులుగా కావ్వా లక్ష్మారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, నాయకులు ఆవునూరి సమ్మయ్య, ముక్కెర రాజు, డేగల సారయ్య ఎరుకొండ నరసింహస్వామి, జన్ను జకర్యా, తూముల సదానందం రేణిగుంట్ల భిక్షపతి, చెప్పాల ప్రకాశ్ తదితరులు  పాల్గొన్నారు.