calender_icon.png 19 January, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాయామంతో యువతకు ప్రత్యేక ఉత్తేజం కలుగుతుంది

19-01-2025 08:16:17 PM

తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్ కుమార్

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): యువత ప్రతి నిత్యం వ్యాయామం చేస్తే రోజువారీ పనుల్లో కొత్త ఉత్తేజం వస్తుందని తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్ కుమార్(Telangana Olympic Association Joint Secretary Konda Vijay Kumar) తెలిపారు. అదివారం వరల్డ్ పవర్ లిప్టింగ్ తెలంగాణ శాఖ(World Powerlifting Telangana Branch) ఆధ్వర్యంలో చందానగర్ హుడాకాలనీలో డి క్రాస్ ఫిట్ నెస్ స్టూడియోస్(D Cross Fit Studios)లో నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను(Powerlifting Championship Competitions) కొండా విజయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండా విజయ్ మాట్లాడుతూ... నగరంలో సరికొత్త హంగులతో జిమ్ ఏర్పాటుతో యువతలో శారీరకంగా దృడంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పవర్ లిప్టింగ్ పోటీలు(Powerlifting Competitions) స్నేహ పూర్వక వాతావరణం ఏర్పాటు చేస్తాయని కొండా విజయ్ కుమార్ పేర్కోన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్ లిప్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రేఖ, కార్యదర్శి తిరుపతి, ప్రసాద్, సూనిల్ రాజ్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.