ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్
న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. ఢిల్లీలోని కర్ణీసింగ్ స్టేడియంలో జరుగుతున్న పోటీల్లో గురువారం భారత షూటర్ల రెండు పతకాలతో మెరిశారు. స్కీట్ షూటింగ్ కాంపిటీష న్‌లో వివాన్ కపూర్ రజతం కొల్లగొట్టగా.. మరో షూటర్ అనంత్ జీత్ సింగ్ కాంస్యంతో మెరిశాడు.
గురువారం జరిగిన పురుషుల స్కీట్ ఫైనల్లో వివాన్ కపూర్ 44 షాట్లు కొట్టి రజతం సొంతం చేసుకున్నాడు. చైనా షూటర్ యింగ్ క్యూ స్వర్ణం, టర్కీ షూటర్ టోల్కా కాంస్యం దక్కించుకున్నారు. మరో భారత షూటర్ అనంత్ జీత్ సింగ్ నకూరా షూటిం గ్ స్కీట్ ఫైనల్లో 43 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం ఒడిసిపట్టాడు.
ఇటలీ షూటర్లు టమ్మారో, గాబ్రిలె రొసెట్టి స్వర్ణ, రజతాలు కొల్లగొట్టారు. ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం. సోనమ్ మస్కర్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), అఖిల్ షోరేన్ (50 మీ రైఫిల్ పొజిషన్)లో వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.