అండర్-19 బాక్సింగ్ టోర్నీ
న్యూఢిల్లీ: అమెరికాలోని కొలరాడో వేదికగా జరుగుతున్న అండర్-19 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్లు సత్తా చాటారు. మహిళల 75 కేజీల విభాగంలో భారత బాక్సర్ కృష్ణ వర్మ స్వర్ణం సాధించగా.. మరో ఐదుగురు భారత బాక్సర్లు రజతాలు సాధించారు.
మహిళల 48 కేజీల విభాగంలో చంచల్ చౌదరి, మహిళల 57 కేజీల విభాగంలో అంజలి కుమారి సింగ్, మహిళల 60 కేజీల విభాగంలో విని, మహిళల 70 కేజీల విభాగంలో ఫలస్వాల్, పురుషుల 75 కేజీల విభాగంలో రాహుల్ కుందులు రజతాలు దక్కించుకున్నారు. భారత్కు ఇదే తొలి అండర్-19 టోర్నీ కాగా మొత్తంగా ఆరు పతకాలు వచ్చి చేరాయి.