ప్రతి పైసా బాధ్యతతో ఖర్చుచేశాం
- పునరుత్పాదక ఇంధనరంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం
- 39,067 విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం
- ప్రెస్‌మీట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
* రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి.. ఒకటో తారీఖున వేతనాలు ఇవ్వలేని బీఆర్‌ఎస్ పాలకులు మా సర్కారుపై అడ్డగోలుగా మాట్లాడడం విడ్డూరమే. అప్పులు కట్టడానికి తిరిగి అప్పులు తీసుకొచ్చే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చింది బీఆర్‌ఎస్ పాలకులు కాదా?
డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వారాల్లో విద్యుత్ పాలసీని ప్రకటించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గ్రీన్ అండ్ క్లీన్ ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగా మిగా నిలిపే లక్ష్యంతో తమ ప్రభుత్వం రెనెవబుల్ ఎనర్జీ పాలసీని కూడా తీసుకురాబోతోందన్నారు.
జస్టిస్ లోకూర్ నేతృత్వంలోని విద్యుత్ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అందజేసిందని, దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాపాలన- ప్రజా విజయో త్సవాల్లో భాగంగా గురువారం సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమా వేశంలో ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్లానింగ్, విద్యుత్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియాతో కలిసి ఆర్థిక, విద్యుత్, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ల ప్రగతి నివేదికను ఆయన వివరించారు.
మొదటి ఏడాదిలో ప్రజలపై పన్నుల భారం మోపకుండా వచ్చిన ప్రతి పైసాను అర్థవంతంగా ప్రజల కోసం ఖర్చు చేశామని ప్రకటిచారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి తే.. తాము వచ్చిన తర్వాత గాడిలో పెట్టామన్నా రు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామన్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, ఒకటో తేదీన వేతనాలు ఇవ్వలేని బీఆర్‌ఎస్ పాలకులు తమ సర్కారుపై అడ్డగోలుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అప్పులు కట్టడానికి తిరిగి అ ప్పులు తీసుకొచ్చే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకువచ్చింది బీఆర్‌ఎస్ పాలకులు కాదా? అని ప్రశ్నిం చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో అప్పులు, వడ్డీల కింద 64, 516 కోట్లను చెల్లించిందని, మూలధన వ్యయం రూ.24,036 కోట్లను ఖర్చు చేశామని, మరో రూ.61,194 కోట్లను సంక్షేమం కోసం వెచ్చించినట్లు భట్టి స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయని, ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, కానీ తాము వచ్చిన తర్వాత టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు.
నాణ్యమైన విద్యుత్
గత పదేళ్లలో విద్యుత్ రంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన గత పాలకులు.. ఇప్పుడు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలో ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసిందన్నారు. భవిష్యత్ విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఇంధన శాఖ ప్రణాళికా బద్ధంగా ముందుకు పోతోందన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాకుండా గత ప్రభుత్వం గాలికి వదిలేయగా.. తాము అనుమతులు తీసుకొచ్చామన్నారు. మహిళా స్వయం సహాయక బృందాల సాధికారత కోసం 4,000 మెగావాట్ల సౌర ఇంధన ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.
మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి విద్యుత్ శాఖ ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాలకు కరెంటును అమ్ముకునే స్థాయికి తెలంగాణను తీసుకుపోతామని భట్టి స్పష్టం చేశారు.
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేయడం వల్ల రావలసిన అనుమతులకు ఆలస్యమయ్యాయని, 20నెలల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టిందన్నారు. దీని వల్ల నిర్మాణ వ్యయం రూ.7,290 కోట్ల నుంచి రూ.10,515.84 కోట్లకు పెరిగిందని చెప్పారు.
2047 విజన్
తెలంగాణ రాష్ట్రానికి దశా దిశా మార్గదర్శన్ని నిర్దేశించే విధంగా 2047 నాటికి కావలసిన విజన్ డాక్యుమెంట్‌ను ప్లానింగ్ శాఖ తయారు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ప్రజాపాలన ద్వారా వారం రోజుల పాటు గ్రామాల్లో గ్రామసభలు పెట్టి తీసుకున్న ఒక కోటి 28 వేల దరఖాస్తులను డిజిటలైజేషన్ చేశామన్నారు.
గృహ జ్యోతి, సబ్సిడీ సిలిండర్ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ప్రజాపాలన డిజిటలైజేషన్ నుంచి సమాచా రాన్ని తీసుకున్నామని వివరించారు. ప్రజా భవన్‌లో వారానికి రెండు రోజులపాటు ప్రజావాణి నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తు తం రాష్ట్రంలో కులగణన సర్వే కొనసాగుతోందన్నారు. ప్రజలందరికీ సమాన అవకాశాలను పంచడానికి సర్వే సమాచారం ఉపయోగపడుతుందన్నారు
విద్యుత్ గరిష్ఠ డిమాండ్ అంచనాలు
2024 15,623 మెగావాట్లు
2030 22,448 మెగావాట్లు
2035 31, 809 మెగావాట్లు
బీఅర్‌ఎస్ ప్రభుత్వం ఛతీస్‌గఢ్‌తో చేసుకున్న లాంగ్ టర్మ్ కారిడారు ఒప్పందం వల్ల తెలంగాణ డిస్కీంలపై రూ.261.31కోట్ల భారం పడిందన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులను తీసుకురాకుండా గాలికి వదిలేయడంతో ప్రాజెక్టు వ్యయం రూ.25,099 కోట్ల నుంచి 36,131 కోట్లకు పెరిగినట్లు భట్టి వెల్లడించారు. యాదాద్రిలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్రానికి అంకితం చేయబోతున్నట్లు వివరించారు.
సెప్టెంబర్ నుంచి 39,067 విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ అందించే పథకాన్ని వినూత్నంగా ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికి 198.87 కోట్లు ఖర్చు చేశామన్నారు. విద్యా సంస్థలకు రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లను అందించాలని ప్రణాళికలు తయారుచేశామన్నారు.