- రిపోర్టు ప్రజల ముందుకు
- తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రజలు
- సర్వేలో పాల్గొనని వాళ్లు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చు
- డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): కులగణన సర్వే విజయవం తంగా పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ప్రజల ముందుంచుతామని, సర్వేకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తామని ఆయన చెప్పారు.
సామాజిక న్యాయం అమలుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే సమాచారాన్ని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు, సామాజిక పరంగా తీసుకునే నిర్ణయాలకు తప్పనిసరిగా వాడుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం రాష్ర్ట సచివాలయంలో ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో ఉప ముఖ్యమం త్రి భట్టి విక్రమార్క మాట్లాడారు.
రాష్ర్టంలో కులగణన సర్వే జరుగొద్దని కుట్రదారులు తప్పుడు ప్రచారంచేసి, సర్వేలో పాల్గొనవద్దని పిలుపు ఇచ్చినప్పటికీ, రాష్ర్ట ప్రభుత్వం ఆలోచనను అర్థం చేసుకొని సర్వే విజయవంతం కావడానికి ప్రజలు సహకరించి దు ష్ర్పచారాన్ని తిప్పి కొట్టారన్నారు. దశాబ్దాలుగా కొన్నివర్గాల ప్రజలు ఎదురుచూస్తున్న కులగణన సర్వే పూర్తిచేసి చట్టసభలో ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.
కులగణన చాలా పారదర్శకంగా, శాస్త్రీయంగా జరిగిందని వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కులగణన సర్వే మొదలుపెట్టడానికి సుదీర్ఘంగా కసరత్తు చేశామని ఆయన వివరించారు. 4 ఫిబ్రవరి 2024న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, 16 ఫిబ్రవరి 2024న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. 10 అక్టోబర్ 2024 న సర్వే కోసం జీవో విడుదల చేశామన్నారు.
విజయవంతంగా పూర్తి చేశాం..
సర్వే పర్యవేక్షణకు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన 19 అక్టోబర్ 2024న సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. రాష్ర్టంలోని ప్రతి జిల్లాను 150 కుటుంబాలతో కూడిన ఎన్యూమరేషన్ బ్లాక్‌గా విభజించి తద్వారా 94,261 బ్లాక్‌లను ఏర్పాటు చేశామన్నారు.
రాష్ర్ట వ్యాప్తంగా 1, 03, 889 ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లను నియమించి వారికి శిక్షణ ఇచ్చి నిరంతరం ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడం కోసం జిల్లా అడిషనల్ కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించి, జిల్లా కలెక్టర్ల నిరంతరం పర్యవేక్షణ చేసే విధంగా ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి మానిటరింగ్ చేసి పకడ్బందీగా సర్వే పూర్తి చేశామని భట్టి వివరించారు.
ఈ సర్వే రాష్ర్టంలోని ప్రజల స్థితిగతులపై ఫుల్ బాడీ చెకప్, ఒక ఎక్స్‌రే లాంటిదన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం నిబ ద్ధతతో ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తుందన్నా రు. గత కులగణన సర్వేలో పాల్గొనని వారు ఇప్పుడు ఆసక్తి కనబరిచి సమాచారం ఇస్తే తీసుకునేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉన్నదని ఆయన వెల్లడించారు.
ఈ కులగణన సర్వే దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారమార్గం చూపించే ప్రక్రియ గా ఉపయోగపడుతుందన్నారు. మరి కొద్ది రోజుల్లోనే మీడియా సమావేశం నిర్వహించి కులగణన సర్వేకు సంబంధించిన అంశాలను డిటైల్డ్‌గా ప్రజెంటేషన్ చేసి ప్రజల ముందు ఉంచుతామని పునరుద్ఘాటించారు.
సర్వే సక్సెస్ కావడానికి సహకరించిన ప్రజలకు, మీడియా మిత్రులకు, శాస్త్రీయం గా సర్వే చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సీఎస్ శాంతకుమారి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు.