calender_icon.png 2 April, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పవర్‌ప్లాంట్ సమస్యలు పరిష్కరించాలి

29-03-2025 12:31:55 AM

సీఅండ్‌ఎండీకి విన్నవించిన బీఎంఎస్ నాయకులు

మంచిర్యాల, మార్చి 28 (విజయక్రాంతి) : జైపూర్ పవర్ ప్లాంట్ కాంటాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బీఎంఎస్ నాయకులు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) బలరాం నాయక్ ను కోరారు.

శుక్ర వారం సీఎండీకి వినతి పత్రం అందజేసిన అనంతరం బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్, జాతీయ సేఫ్టీ కమిటీ సభ్యులు కొత్త కాపు లక్ష్మారెడ్డి, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యూనియన్ (బిఎంఎస్) జిల్లా అధ్యక్షులు యాదగిరి సత్తయ్యతో కలిసి మాట్లాడారు.

జైపూర్ పవర్ ప్లాంట్ కాంటాక్ట్ కార్మికుల సమస్యలపై హైదరాబాద్ డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ వద్ద మెమోరాండం ఆప్ సెటిల్ మెంట్ ఒప్పందము ప్రకారము క్యాంటీన్ సదుపాయం వెంటనే ప్రారంభించి, యాజ మాన్యం సబ్సిడీ రేట్ పైన కొనసాగించాలని, జైపూర్ పవర్ ప్లాంట్ విస్తరణ కోసం భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించిన జైపూర్ పవర్ ప్లాంట్ యాజమాన్యం.

చదువుకున్న యోగ్యత కలిగిన కార్మికులకు తగిన పదోన్నతులు కల్పించడానికి ఒప్పుకున్న ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, జైపూర్ ఫ్లవర్ ప్లాంట్ లో విధులు నిర్వహించుటకు బస్సు సౌకర్యం ఏర్పాటు వెంటనే చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న,  5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న కార్మికులందరికీ పదోన్నతులు కల్పించడానికి, పవర్ ప్లాంటు విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు విధి నిర్వహణ లో ప్రమాదాలు జరిగి ప్రాణం కోల్పోతే కుటుంబ సభ్యులలో ఒకరికి సూటబుల్ ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్న ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలన్నారు.

ఎన్‌టీపీసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల మాదిరిగా అలవెన్సులు

జైపూర్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు రామగుండం ఎన్టిపిసి కాంట్రాక్టు ఉద్యోగుల మాదిరిగా అలవెన్సులు చెల్లించేలా సంబంధిత యాజమాన్యంతో చర్చి స్తామని వారు అన్నారు. ప్రతి కార్మికునికి రూ. 5 వేలు అలవెన్సుల రూపంలో చెల్లించాలని మాట్లాడుతామన్నారు.

సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు పవర్ మేక్ ప్రైవేట్ యాజమాన్యం అమలు చేస్తున్న క్యాజువల్ లీవ్, సిక్ లీవ్, వేతనం లీవ్, ప్లేడేలు పీహెచ్డీలు చెల్లించే మాదిరిగా సివిల్ డిపార్ట్ మెంట్ లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాలని చేసిన విజ్ఞప్తి మేరకు త్వరలోనే జైపూర్ పవర్ ప్లాంట్ యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యూనియన్ (బిఎంఎస్) నాయకులు పులి రాజారెడ్డి, మండ రమాకాంత్, ప్రధాన కార్యదర్శి దుస్స భాస్కర్, బోడకుంట శ్రీధర్, పెద్దిరెడ్డి కిషన్ రెడ్డి, శివకృష్ణ, చిలకాని వెంకటేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.