calender_icon.png 29 April, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిలిచిన విద్యుత్ సరఫరా

28-04-2025 11:39:49 PM

స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లో సమస్య..

ఆగిపోయిన రైల్వే, విమానాశ్రయ సేవలు..

పారిస్: యురోపియన్ విద్యుత్ గ్రిడ్‌లో సమస్య ఉత్పన్నం కావడంతో సోమవారం పలు యురోపియన్ దేశాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్పెయిన్, పోర్చుగల్‌తో పాటు ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ అంతరాయం వల్ల పలు ప్రాంతాల్లో విమానాలు ఆలస్యం అయ్యాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రైల్వేలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యపై స్పెయిన్ ప్రధాని కార్యాలయం స్పందించింది. ‘సమస్యను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని పేర్కొంది. యురోపియన్ విద్యుత్ గ్రిడ్‌లో సమస్య ఉత్పన్నం కావడమే ఈ సమస్యకు కారణంగా తెలుస్తోంది. విద్యుత్ అంతరాయ సమస్యతో స్పెయిన్, పోర్చుగల్ దేశాలు అత్యవసర క్యాబినెట్ భేటీ నిర్వహించాయి. విద్యుత్ సమస్యతో మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీని కూడా రద్దు చేశారు.