calender_icon.png 5 February, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

05-02-2025 06:57:56 PM

అశ్వారావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో గురువారం అశ్వారావుపేట సబ్ డివిజన్ పరిదిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం వుంటుందని అశ్వారావుపేట సబ్ డివిజన్ ఏడీ, ఈఈఓ బుధవారం ప్రకటనలో తెలిపారు. అశ్వారావుపేట 132/33కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నందు మరమ్మత్తులు ఉన్నందున అశ్వారావుపేట మండలం, దమ్మపేట మండలంలో గురువారం మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు 33kv అశ్వారావుపేట, 33కేవీ దమ్మపేట, 33కేవీ వినాయకపురం, 33కేవీ నారంవారిగూడెం సబ్ స్టేషన్ల పరిదిలోని గృహవినీయోగదారులకు సింగిల్ ఫేజ్ విద్యుత్ సరఫరా వుంటుందని ఏడీ ఈఈ తెలిపారు. త్రి ఫేజ్ విద్యుత్ కు సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. రైతులు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.