నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ విద్యుత్ శాఖ డివిజన్ పరిధిలోని దిమ్మదుర్తి పొంకల్ 33 బై 11 కెవి విద్యుత్ సబ్స్టేషన్లలో సోమవారం మరమ్మత్తుల దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆపరేషన్ డిఈ నాగరాజు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సబ్స్టేషన్ల మరమ్మత్తుల దృష్ట్యా విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందన్నారు. సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.