calender_icon.png 26 April, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సరఫరాలో నేడు అంతరాయం

26-04-2025 12:00:00 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 25:  శనివారం కొత్త సర్వీసులు రిలీజింగ్, మర మ్మతుల నేపథ్యంలో పలు ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరా యం ఉంటుందని నార్సింగి విద్యుత్ ఆపరేషన్ సెక్షన్ ఏఈ మణికంఠ తెలిపారు.  నార్సింగి-1 సబ్ స్టేషన్ పరిధి లో.. 11కేవీ శ్రీ నగర్ ఫీడర్ లో ఉద యం 9:00 గంటల నుంచి 09:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. గండిపేట, శ్రీ నగర్, గ్రే హో మ్స్.

మార్కెట్ యార్డ్ సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ సాయి బాబా టెంపుల్ ఫీడర్ లో సాయంత్రం 4:30 నుండి 5 వరకు గిరి గిరి గడ్డ, నార్సింగి గ్రామం, ముప్పా విల్లాస్, ముప్పా అలేఖ్యలో కరెంటు సరఫరా ఉండదు.  11కేవీ బా లాజీ నగర్ ఫీడర్ లో 4:30 గంటల నుంచి 5 గంటల వరకు మంచిరేవుల, మంత్రి విల్లాస్, గ్రీన్ ల్యాండ్, జై హిం దూ కాలనీలో కరెంట్ బంద్ ఉంటుంది. 

అదేవిధంగా కోకపేట సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ బాబు ఖాన్ ఫీడర్ లో 09:30 గంటల నుంచి 10  వరకు 250 యారడ్స్ గోల్డెన్ మెయిల్, బాబు ఖాన్ విల్లాస్, గ్రాండ్ ఇన్ఫ్రా టెక్ వి ల్లాస్, దంతు స్వీట్ హౌస్ ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు ఈ విషయాన్ని వినియోగదారులు గమనించా లని విజ్ఞప్తి చేశారు.