ఒలింపిక్స్‌కు ఆతిధ్యమిస్తున్న పారిస్‌లో కరెంటు కోతలు కలవరపెడుతు న్నాయి. అనేక ప్రాంతాల్లో కరెంటు కట్ అయినట్లు పలువురు సోషల్ మీడియా వేదికగా ఫొటోలు, వీడియోలు పంచుకుంటున్నారు. ఒలింపిక్స్ విలేజ్‌లో డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని నిలిపివేశారు. ఇప్పటికే అక్కడ వర్షాలతో పలు ఈవెంట్లు వాయిదా పడటమో లేక రద్దవడమో జరుగుతోంది. ఒలింపిక్స్ వేడు కలకు ముందు దాడులు జరిగాయి. సీన్ నది కాలుష్యం కారణంగా స్విమ్మిం గ్ ట్రయథ్లాన్ తొలి ట్రైనింగ్ సెషన్ కూడా రద్దు చేశారు.