23-03-2025 12:10:00 AM
మాజీమంత్రి కేటీఆర్
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయని, ఈ సమయంలో కరెంట్ కోతలు ఉండడం సరైందేనా? అని ఎక్స్ వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ప్రశ్నించారు. ఉదయం తనకు పలు మెసేజ్‌లు, ఫొటోలు వచ్చాయన్నారు. వాటిలోని ఒక మెసేజ్‌లో “ నా కొడుకు టెన్త్ క్లాస్. రేపు హిందీ పరీక్ష ఉంది. మూడు గంటలవుతుంది కరెంటు పోయి” అని ఉందని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కరెంట్ కోతలు లేకుండా చూడాలని కోరారు.