calender_icon.png 28 February, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ వేదికగా ప్రదర్శనగా సాగే 72వ ప్రపంచ అందాల పోటీలను అడ్డుకుంటాం

27-02-2025 10:52:15 PM

ముషీరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ వేదికగా అంరంగ ప్రదర్శనగా సాగే 72వ ప్రపంచ అందాల పోటీలను అడ్డుకుంటామని ప్రోగ్రేసీవ్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ (Progressive Organization for Women) తెలంగాణ స్టేట్ కమిటీ హెచ్చరించింది. ఆత్మహత్యలు, ఆకలిచావుల సూచీలో మొదటి రెండో వరుసలో ఉన్న ఈ దేశంలో ఆందాల పోటీలు ఎవరికోసమని కమిటీ ప్రశ్నించింది. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రగతి శీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు వి.సంధ్య, జి. ఝాన్సీ, రాష్ట్ర అధ్యక్షురాలు జి. అనసూయ, కాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, కార్యదర్శి ఆర్. గీతలు మాట్లాడుతూ సామాజిక, అర్థిక, రాజకీయ సమానత్వంకై పోరాడుదాం, మహిళలపై హింసను వ్యతిరేకిద్దాం అన్న పిలుపుతో మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని తెలిపారు.

పార్టీలు ఏవైనా ప్రభుత్వాల తీరు ఒకటే అన్నది ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తే అర్థమవుతుందని అన్నారు. వాగ్దానాలతో మభ్యపెట్టి అధికారంలోకి రావడం, ప్రభుత్వంలోకి వచ్చాక ప్రజా, మహిళా వ్యతిరేక చర్యలు చేపట్టడం చూస్తున్నామని వారు మండిపడ్డారు. మధ్యం మీదనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆధారపడి ఉన్నాయని పాలకులు నిస్సిగ్గుగా చెపుతున్నారని, ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కారని, మహిళల భద్రత గాలిలో దీపమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ నాయకురాలు జి. భారతి, పేమలత తదితరులు పాల్గొన్నారు.