పెద్దపల్లి,(విజయక్రాంతి): తెలంగాణలో ధరణి అనే దరిద్రం పోయిందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పది ఏండ్లు రైతులు ధరణి పోర్టల్ తో చాలా ఇబ్బంది పడ్డారని, భూములు వున్నా పాస్ బుక్ లు రాక పరేషాన్ అయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పింది. చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి తీసుకొచ్చిందని సురేందర్ రెడ్డి తెలిపారు.
ఏడాది కాలంగా రైతులతో, మేధావులతో, రెవెన్యూ అధికారులతో చర్చించి భూ భారతిని తీసుకొచ్చి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, శ్రీనివాస్ రెడ్డి లు అసెంబ్లీ కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని ప్రవేశ పెట్టినందుకు సంతోషంగా రైతులు పండుగ చేసుకుంటున్నారన్నారు. యావత్ తెలంగాణ రైతాంగం పక్షాన, కిసాన్ కాంగ్రెస్ తరుపున సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, వ్యవసాయ మంత్రి తుమ్మలకు రైతుల పక్షాన సురేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.