గ్రామీణ ప్రాంత నటీ నటులను ప్రోత్సహించాలి
ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి
గజ్వేల్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత నటీ నటులను ప్రోత్సహించాలని ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నేత రాజేశ్వరరావు లు అన్నారు. గజ్వేల్ ప్రాంత సినీ నటుడు అనిల్ మొగిలి మరియు ప్రముఖ ఫోక్ వీడియో డాన్సర్ జాను లిరి ఉమ్మడిగా నటించిన తాజా ప్రైవేట్ ఫోక్ ఆల్బమ్ పౌరుషాల పిల్లగాడు ప్రోమో పోస్టర్ ను మంగళవారం గజ్వేల్ లో ఆవిష్కరించిన సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామీణ ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్ర ఆడియో సాంగ్ అద్భుతంగా ఉందని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే సింగర్ పాడిన ఇంస్టాగ్రామ్ సంఖ్య 20 లక్షలు దాటగా, అశేష ప్రేక్షకాదరణతో హిట్ అవుతుందని ఆకాంక్షించారు. పెద్ద హీరోలను కాకుండా గ్రామీణ ప్రాంత యువ హీరోలు రూపొందిస్తున్న గ్రామీణ ప్రాంత కథలు, వాతావరణతో కూడిన చిత్రాలు ఆదరించాలని పేర్కొన్నారు. తద్వారా అనిల్ మొగిలి వంటి యువ హీరోలు రాణించి చక్కటి భవిష్యత్తుతో దూసుకెళ్తారని అన్నారు. అయితే అనిల్ మొగిలి నటించిన పలు చిత్రాలు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద బద్దలు కొట్టగా, ఆ యువ హీరో ప్రేక్షకుల్లో మంచి క్రేజీ సంపాదించుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.