పెద్దపల్లి, అక్టోబర్ 20 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఆటో డ్రైవర్ రెహమాన్ ఆదివారం పెట్రోల్ మీద పోసుకుని ఆందోళన చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన ఆటోను ఎందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకుచ్చారంటూ ఆందోళన చేశాడు. పోలీసులు రెహమాన్‌ను సముదాయించి, స్టేషన్‌లోకి తీసుకెళ్లి శాంతింపజేశారు. పెద్దపల్లి పట్టణంలో ఇటీవల జరిగిన ఓ దొంగతనం కేసు విచారణ చేస్తుండగా పోలీసులకు రెహమాన్ ఆటోపై అనుమానంతో స్టేషన్‌కు తీసుకువచ్చినట్టు తెలిసింది.