calender_icon.png 24 December, 2024 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలు పోసుకుని పైసల్ ఇవ్వరా?

13-09-2024 02:38:05 AM

విజయ డెయిరీ నిర్వాకంపై పాడి రైతుల ఆందోళన... పాలు రోడ్డుపై పారబోసి నిరసన  

జడ్చర్ల, సెప్టెంబర్ 12: క్రమం తప్పకుండా పాలు పోయించుకుని పైసల్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న విజ యడెయిరీ తీరును నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో గురువారం విజయడెయిరీ ఆఫీస్‌కు తాళం వేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద పాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలి పారు. గత 5 నెలల నుంచి బిల్లులు ఇవ్వడం లేదని, ఎన్నిమార్లు అధికారులను సంప్రదించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నెలల కొద్ది బిల్లులు ఇవ్వకుంటే తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. వెంటనే తమకు ఇవ్వాల్సిన పాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.