calender_icon.png 5 December, 2024 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు సరికాదు

01-11-2024 06:41:07 PM

బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి

కరీంనగర్,(విజయక్రాంతి): తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు సమంజసం కాదని  బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం  అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆత్మ బలిదానం గావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.

దేశం గర్వించదగ్గ నాయకుడని,  భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆధ్యుడని వివరించారు.  ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పేరు మార్పుకు ఆమోదం తెలపడం పట్ల మన రాష్ట్రంలోనే కాక వేరే రాష్ట్రాలలో ఉన్న ఆర్యవైశ్యులతో పాటు తెలుగు బాషాభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు.  అలాగే తొలగించిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని పున:ప్రతిష్ఠాంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణకు అందించిన సేవలు చిరస్మరణీయని, అతడి పేరు కోసం శ్రీరాముడు పేరును తొలగించడం సరికాదని కోరారు.

కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కన్న కృష్ణ,ప్రధాన కార్యదర్శి కొమురవెల్లి వెంకటేశం, కోశాధికారి పడకంటి శ్రీనివాస్, మీడియా కమిటీ చైర్మన్ చిట్టుమల్ల మహేందర్, వివాహ పరిచయ వేదిక కమిటీ చైర్మన్ రాచమల్ల భద్రయ్య, సాంస్కృతిక  కమిటీ ఛైర్మన్ గోగుల ప్రసాద్, వాణిజ్య సెల్ కమిటీ చైర్మన్ దేవిశెట్టి రమేశ్, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు జిడిగే సాయి కృష్ణ,పొట్టి శ్రీ రాములు, ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల రామేశం పాల్గొన్నారు.