16-03-2025 12:57:38 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా. తుంగతుర్తి మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్ అధ్యక్షతన మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం ఆదివారం వద్ద జయంతి కార్యక్రమంలో భాగంగా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా బాధ్యులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు ఉండగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పేరును మార్చి అసెంబ్లీలో తీర్మానం చేయడం దారుణమని ఆయన అన్నారు.
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు తక్షణమే స్పందించి, శ్రీ రాముల పేరుని యధావిదంగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు బండారు దయాకర్ ప్రధాన కార్యదర్శి ఈగ నాగన్న కోశాధికారి మాశెట్టి వెంకన్న భవన నిర్మాణ కమిటీ కోశాధికారి బుద్ధ వీరన్న జిల్లా సహాయ కార్యదర్శి గోపారపు సత్యనారాయణ బండారు శేషయ్య తల్లాడ శ్రీహరి రాములుతాళ్లపల్లి సోమన్న ఓరుగంటి అశోక్ బచ్చు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు