calender_icon.png 16 March, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొట్టి శ్రీరాములు 123వ జయంతి

16-03-2025 11:52:14 AM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పొట్టి శ్రీరాములు 123వ జయంతి వేడుకలను నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి భూమేష్ గుప్త మాట్లాడుతున్న పొట్టి శ్రీరాములు ఆదర్శమూర్తిగా నిలిచారని ఆయన ఆశయాలను ప్రతి ఆర్యవైశ్య సోదరులు కొనసాగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ మోటుర్ శ్రీకాంత్ గుప్తా, కౌన్సిలర్ పార్షి కాంశెట్టి, పేపర్ శ్రీనివాస్, ఆర్యవైశ్య యూత్ ఉపాధ్యక్షుడు వలపుశెట్టి భాస్కర్, గరిపల్లి శ్రీధర్, ఆకుల నారాయణ, యాద అంజయ్య, పిప్పిరి శేఖర్, విశ్వం, కుబీ, బొడ్ల వేణు గోపాల్, ఆర్యవైశ్య సంఘం పెద్దలు పాల్గొన్నారు.