యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ యాక్ష న్ డ్రామాను నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర బుధవారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా విశేషా లను మీడియాతో పంచుకున్నారు.
* డైరెక్టర్ సాహిత్ ‘పొట్టేల్’ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. కళ్లెంబట నీళ్లు వచ్చాయి. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎన్ని కష్టాలైనా పడాలనే మంచి సందేశం ఈ సినిమాలో ఉంది. సినిమాను చాలా సహజంగా తీశారు.. ఆ సహజత్వాన్ని పట్టుకుని సంగీతం సమకూర్చడానికి నాకూ కొంత సమయం పట్టింది. లిరిక్స్ సింగిల్ కార్డ్ కాసర్ల శ్యామ్ రాశారు. ప్రతి లిరిక్ కథకు చాలా ముఖ్యం. ఇందులో ఒక విలేజ్ సాంగ్‌ను రూరల్‌గా కాకుండా కొంచెం వెస్ట్ర న్ స్టుల్‌లో చేశాం. అన్ని పాటలూ సవాల్‌గా తీసుకున్నా. అందుకే ‘పొట్టేల్’ సంగీతం కొత్త అనుభూతినిస్తుందని నమ్మంగా చెప్పగలను.
* నేనొక డమ్మీ లిరిక్ అనుకొని బాణీ కడతాను. నా పాటల్లో ఎక్కువగా సాహిత్యానికి స్కోప్ ఉంటుంది.
* పాటలు హిట్ అయితే ఆనందంగా ఉంటుం ది. ఇంకా హిట్స్ కొట్టాలి, బిగ్ లీగ్ మూవీస్ రావాలి అనే ఫీలింగ్ ఉంటుంది. అప్‌డేట్ అవడానికి ఎక్కువగా సంగీతం వింటాను. ఎలాంటి పాట లు వస్తున్నాయి.. ఏ ట్రెండ్ నడుస్తుందో గమనిస్తుంటాను. అలాగే వరల్డ్ మూవీస్ కూడా చూస్తుంటాను.
* రాజ్‌తరుణ్‌తో ఒక సినిమా, నవీన్ చంద్ర మరో చిత్రం చేస్తున్నాను. వరలక్ష్మీ శరత్‌కుమార్ ‘కూర్మనాయికి’ మూవీ చేస్తున్నాను. తెలుగు -కన్నడ మూవీ ఒకటి జరుగుతోంది.